![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-7 లో ప్రతీవారం కొత్త టాస్క్ లతో మంచి కిక్కు ఇస్తున్నాడు బిగ్ బాస్. అయితే ఇప్పటి వరకు ఈ సీజన్ లో సీక్రెట్ టాస్క్ జరుగలేదు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో.. సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ వారమంతా హౌస్‌లో జరిగిన మర్డర్ వెనుక మిస్టరీని ఛేదించే పనిలో అమర్ దీప్, అర్జున్ పోలీసులుగా తిరుగుతున్నారు. ఇక బిగ్‌బాస్ భార్యను హత్య చేసింది తానే అని తెలీకుండా శివాజీ తిరుగుతూ మరికొంతమందిని చంపాలి.
బిబి మాన్షన్ మేనేజర్ గా శివాజీ ఉన్నాడు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ప్రకారం.. మిసెస్ బిగ్ బాస్ ని చంపింది శివాజీ కానీ ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడాలి. శివాజీనే హంతకుడు అనే విషయం హౌస్ లో ఏ ఒక్కరికి తెలియదు. అంబటి అర్జున్, అమర్ దీప్ పోలీసులుగా ఉన్నారు. అశ్విని, శోభాలను పార్టీలో ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన రిపోర్టర్లుగా వ్యవహరించాలని, బ్రేకింగ్ న్యూస్ కోసం వెతుకుతూ ఇద్దరూ పోటీ పడాలని రోల్ ఇచ్చాడు. అలానే యావర్, ప్రియాంకలు బ్రదర్ అండ్ సిస్టర్లుగా సహాయకులని చెప్పాడు. ఇక రతికకి డ్రైవర్ రోల్ ఇచ్చాడు. ఇక తనని ప్రేమిస్తూ చుట్టూ తిరిగే తోటమాలి గెటప్‌లో గౌతమ్, ప్రశాంత్‌కి వంటచేసేవాడిగా పాత్ర ఇచ్చాడు బిగ్‌బాస్. అయితే ప్రశాంత్ చేసే ఏ వంట మిసెస్ బిగ్ బాస్ కి నచ్చేది కాదని చెప్పాడు బిగ్ బాస్.
ఇక మర్డరర్ రతిక అని డౌట్ ఉందని బిగ్ బాస్ తో అంబటి అర్జున్, అమర్ దీప్ లు అనగా రతికని జైల్లో వేశాడు. ఇక నిన్న టాస్క్ సమయం ముగిసాక హౌస్ లో కొన్ని గొడవలు వస్తున్నాయి. శివాజీకి తలనొప్పిగా ఉందని రతిక ఆయిల్ పెట్టి మసాజ్ చేసింది. ఇక అదే మంచి టైమ్ యావర్ ని ఆటపట్టిద్దామని గౌతమ్ కృష్ణ ప్లాన్ చేశాడు. రతిక నేను నీ లవర్ ని కదా నాకు మసాజ్ చేస్తావా అని అనగానే.. సరే దా చేస్తానని రతిక గౌతమ్ కి మసాజ్ చేసింది. అది చూసిన యావర్ ఫీల్ అయిననట్టు తెలుస్తుంది. ఇక చివర్లో.. జస్ట్ జోక్ మచ్చా, నిజంగా చేయమనలేదురా అని యావర్ తో గౌతమ్ అన్నాడు. మొత్తంగా యావర్-రతికల మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందనే క్లారిటీ ప్రేక్షకులకు వచ్చేసింది.
![]() |
![]() |